శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి
26 Mar, 2026 14:59 IST
తాడేపల్లి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకున్నారు.
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అభిలషించారు.