గురువులకు హృదయపూర్వక నమస్కారాలు
10 Jul, 2025 12:21 IST
తాడేపల్లి: విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ వైయస్ జగన్ ట్విట్టర్ చేశారు.