బుద్ధుని బోధనలు సదా ఆచరణీయం
12 May, 2025 10:12 IST
తాడేపల్లి: అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయమని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. నేడు గౌతమ బుద్ధుడి జయంతి. ఈ సందర్భంగా వైయస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్ వేదికగా వైయస్ జగన్..
విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని.. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.