చిల్లకల్లు వైయస్ఆర్‌సీపీ నేత డి. రాంబాబు మృతిపై వైయస్ జగన్ సంతాపం
తాడేపల్లి: ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకుడు, గ్రామ అధ్యక్షుడు డి. రాంబాబు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా అనారోగ్యంతో రాంబాబు మృతి చెందిన విషయం తెలిసి వైయస్ జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు సోదరుడు జానకిరామయ్యతో వైయస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రాంబాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రాంబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ సూచించారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.