నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
20 Mar, 2019 09:25 IST
అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షనేత, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మూడు చోట్ల ఎన్ని కల బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే జిల్లాల వారిగా ప్రచారం చేస్తున్న వైయస్ జగన్.. నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు, మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలి , సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో బహిరంగ సభల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.