ఆలూరు రామచంద్రారెడ్డికి వైయస్ జగన్ పరామర్శ
19 Sep, 2025 15:00 IST
తాడేపల్లి: తాడిపత్రి మండలానికి చెందిన వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ఆలూరు రామచంద్రారెడ్డిని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న రామచంద్రారెడ్డికి శుక్రవారం వైయస్ జగన్ ఫోన్ చేసి వీడియో కాల్‌లో పరామర్శించి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు అంటూ ధైర్యం చెప్పారు.