జమలపూర్ణమ్మకు వైయస్ జగన్ పరామర్శ
10 Dec, 2025 14:58 IST
విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్, వైయస్ఆర్‌సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఆమెను పరామర్శించారు.
కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైయస్ జగన్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైయస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, వైయస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు.