సీఎస్ రంగరాజన్‌కు వైయస్ జగన్ పరామర్శ
19 Feb, 2025 16:17 IST
తాడేపల్లి: ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ను, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. దాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు.