భారత జట్టుకు వైయ‌స్ జగన్‌ అభినందనలు

10 Mar, 2025 10:37 IST

తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేత‌గా నిలిచిన‌ భారత జట్టుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.