ఇస్త్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
27 Nov, 2019 13:22 IST
తాడేపల్లి: పీఎస్‌ఎల్వీ – సీ47 ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ–సీ47 714 కిలోల బరువున్న కార్టోశాట్–3తో పాటు 13 ఉపగ్రహాలను మోసుకెళ్లి విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి వెళ్లింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.