ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ జగన్ అభినందనలు
23 Mar, 2026 12:29 IST
తాడేపల్లి : ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆ ట్వీట్‌లో..
‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైయస్ జగన్ పేర్కొన్నారు.