నందిని సిధారెడ్డికి వైయస్ జగన్ అభినందన
16 Mar, 2026 16:46 IST
తాడేపల్లి: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో జాతీయ స్థాయిలో అత్యున్నతమైన ఈ పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని ఆయన కొనియాడారు. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేసి, తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారని గుర్తు చేశారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని శ్రీ వైయస్ జగన్ ఒక ప్రకటనలో అభివర్ణించారు.