దంగేటి జాహ్నవికి వైయస్ జగన్ అభినందనలు
24 Jun, 2025 16:28 IST
తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని వైయస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.