ధీరజ్ విజయం అందరికీ గర్వకారణం
15 Nov, 2025 08:57 IST
తాడేపల్లి: ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించటంపై వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.