కుంజా రజితకి వైయస్ జగన్ అభినందనలు
3 Jun, 2025 17:36 IST

తాడేపల్లి: భారత అథ్లెట్ కుంజా రజిత కు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని వైయస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.