ఆర్.బి. చౌదరి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం 

6 May, 2026 11:17 IST

తాడేప‌ల్లి: ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి ఆకస్మిక మరణం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారనే విషయం అత్యంత విషాదకరమని తెలిపారు.

ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్.బి. చౌదరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వైయస్ జగన్ తెలిపారు.