కావూరి సాంబశివరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
11 Mar, 2026 15:28 IST
తాడేపల్లి: మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కావూరి సాంబశివరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు గారు ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడని, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, అనుభవం రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించాయని పేర్కొన్నారు. కావూరి సాంబశివరావు గారి మృతి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారికి కలగాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.