మాజీ ఎంపీ రత్నాబాయి మృతి ప‌ట్ల‌ వైయస్ జగన్ సంతాపం

17 Feb, 2026 14:14 IST

తాడేప‌ల్లి: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి (79) గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో రత్నాబాయి గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు.