మండవ వెంకటరామయ్య మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
23 Sep, 2025 11:36 IST
తాడేపల్లి: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్ధాపకులు మండవ వెంకటరామయ్య మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ పేరుతో సంస్ధను ప్రారంభించి లక్షలాది మంది రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూ, భారతదేశంలోని అతి పెద్ద హైబ్రీడ్ సీడ్ కంపెనీలలో ఒకటిగా రూపొందించేందుకు వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని వైయస్ జగన్ అన్నారు. వెంకటరామయ్య కుమారుడు ప్రభాకర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.