నాదెండ్ల భాస్కర్ రావు మరణంపై వైయస్ జగన్ సంతాపం 

22 Apr, 2026 13:10 IST

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణంపై మాజీ ముఖ్యమంత్రి,  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని వైయ‌స్ జగన్ గుర్తు చేశారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం వారికి కలగాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.