ప్రకాశ్ రాజ్ తల్లి మృతిపై వైయస్ జగన్ సంతాపం
30 Mar, 2026 14:49 IST
తాడేపల్లి: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.