అమర జవాన్లకు జననేత నివాళి
17 Feb, 2019 15:44 IST
పశ్చిమగోదావరి: జమ్మూకాశ్మీర్ పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఏలూరు బీసీ గర్జన వేదికకు చేరుకున్న జగన్ మొదటగా అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అంతకుముందు సభా వేదికపై జ్యోతిరావుపూలే, సాయిత్రీబాయి పూలే, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.