మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అ‍హ్మద్‌ మృతిపై వైయ‌స్ జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి 

20 Oct, 2025 19:29 IST

తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్‌ అహ్మద్‌ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్‌ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి అంటూ త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్‌ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు.