చెల్లుబోయిన సుభద్రమ్మ మృతికి వైయస్ జగన్ సంతాపం
1 Jul, 2024 17:55 IST
తాడేపల్లి: మాజీ మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాతృమూర్తి చెల్లుబోయిన సుభద్రమ్మ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సుభద్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.