అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైయస్ జగన్
13 Dec, 2024 18:49 IST
తాడేపల్లి: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండిస్తూ.. వైయస్ జగన్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్‌ను బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని వైయస్ జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అరెస్టును ఖండించారు.