జ‌గ‌న్ మామను చూడాల‌ని..

25 Feb, 2025 20:38 IST

పులివెందుల:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే చిన్న పిల్ల‌లు మొద‌లు పండు వృద్ధుల వ‌ర‌కు విఫ‌రీత‌మైన ప్రేమ‌, అభిమానాలు ఉన్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ పులివెందులలో పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన మెహబూబ్‌ షరీష్‌ ఏడో తరగతి చదువుతున్నాడు, వైయస్‌ జగన్‌ పులివెందుల వస్తున్నారని తెలుసుకుని కాళ్ళకు చెప్పులు లేకపోయినా ఎండలో 5 కిలోమీటర్లు నడిచి వచ్చి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని జగన్‌ కోసం ఎదురుచూశాడు, తాడేపల్లి నుంచి వైయస్‌ జగన్‌ పులివెందుల చేరుకున్న వెంటనే హెలిప్యాడ్‌ వద్ద జగన్‌ను చూసిన షరీఫ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు, ఏం జరిగిందని వైయస్‌ జగన్‌ ఆరాతీయగా తను షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఫోటో దిగాలన్న కోరికతో వచ్చినట్లు చెప్పాడు, దీంతో షరీఫ్‌ను ఓదార్చి తన కోరిక తీర్చి, బాగా చదువుకోవాలని సూచించి ఇంటికి పంపారు.