నూత‌న వధూవరులకు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం 

26 Nov, 2025 11:32 IST

వైయ‌స్ఆర్‌ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుక‌లో పా ల్గొన్నారు. మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైయ‌స్ఆర్‌సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైయ‌స్‌ జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైయ‌స్ జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.