రాష్ట్రపతికి వైయ‌స్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు 

20 Jun, 2025 10:42 IST

తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని.. దేశ సేవలో ఆమె మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదించాలంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్ చేశారు.