నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఇఫ్తార్‌ విందు.. 

18 Mar, 2026 12:10 IST

తాడేప‌ల్లి: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ ఇఫ్తార్‌ విందు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ ఇఫ్తార్‌ విందులో ముస్లిం సోదరులతో కలిసి వైయ‌స్‌ జగన్‌ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.