నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
17 May, 2019 15:34 IST
హైదరాబాద్: మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మీ వివాహ మహోత్సవానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. జస్టిస్ నవీన్‌రావు కుమారుడు నృపుల్రావుతో శ్రీలక్ష్మీ వివాహం జరిగింది. వివాహ మహోత్సవానికి వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.