అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుందాం
1 Nov, 2024 12:59 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోస్టు చేశారు.