సీఎం అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి నియామకం
30 May, 2019 15:56 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అదనపు కార్యదర్శిగా కే. ధనుంజయరెడ్డిని నియమించారు.. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న కె.ధనుంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.