వైయ‌స్‌ జగన్‌.. ఓ భ‌రోసా

1 Apr, 2019 10:50 IST

 

పులివెందుల‌: వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఓ భ‌రోసా అని ఆయన సతీమణి వైయ‌స్‌ భారతీరెడ్డి స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌ జిల్లా పులివెందుల‌ నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు.  ఆమె మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెట్టనున్న ‘నవరత్నాలు’ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.. చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని పునరుద్ఘాటించారు.