పోలీసుల సాక్షిగా పోటెత్తిన దొంగ ఓటర్లు
12 Aug, 2025 11:50 IST
వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో టీడీపీ నేతలు ఓట్లు వేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన మనుషులను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేయించారు. పోలీసుల సమక్షంలో దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భారీగా వచ్చి ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిలబడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్‌లో ఓట్లు వేసిన టీడీపీ నేతలు:
- (1) మల్లిఖార్జున్- టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, పొన్నతోట, జమ్మలమడుగు
- (2) పుల్లారెడ్డి- టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె, జమ్మలమడుగు
- (3) పాతకుంట శివారెడ్డి- గూడెంచెరువు, జమ్మలమడుగు
- (4) రామచంద్రయ్య- చిన్న దండ్లూరు, జమ్మలమడుగు
- (5) రాజన్న - కలవటల, జమ్మలమడుగు
- (6) కుళాయి- కంబళదిన్నె, జమ్మలమడుగు
- (7) రాజగోపాల్- భీమగుండం, జమ్మలమడుగు
- (8) మర్రి ప్రకాశం- నవాబుపేట , జమ్మలమడుగు
- (9) సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి - నవాబుపేట , జమ్మలమడుగు
- (10) ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి- నవాబుపేట , జమ్మలమడుగు