బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం లక్ష్యం

8 Jun, 2026 13:18 IST

 యర్రగొండపాలెం : వైయ‌స్ఆర్‌సీపీని బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో యర్రగొండపాలెం నియోజకవర్గంలో బీఎల్‌ఏ (బూత్ లెవ‌ల్ ఏజెంట్స్‌) అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో బూత్ స్థాయి కార్యకర్తలు, బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, బూత్ స్థాయి నిర్వహణ, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి బూత్‌ను పార్టీకి బలమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ రెడ్డి, రాష్ట్ర బూత్ కన్వీనర్ల ప్రధాన కార్యదర్శి పత్తి రవిచంద్రతో పాటు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.