సీఎం వైయస్ జగన్ మహిళా పక్షపాతి
27 Sep, 2019 16:05 IST
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుపతిలో శుక్రవారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ అన్ని విధాల మహిళలకు చేయూతనిస్తున్నారని తెలిపారు. అలాగే నామినేటెట్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్న గొప్ప సీఎం వైయస్ జగన్ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.