మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ గొప్ప విషయం

7 Sep, 2019 14:35 IST

 

జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుందని, తద్వారా మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ వంద రోజుల పాలన పట్ల ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వంద రోజుల్లో ప్రజలందరి మన్నలను పొందిన సీఎంగా వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు.