అమిత్‌షాకు జన్మదిన శుభాకాంక్షలు
22 Oct, 2022 11:04 IST
అమరావతి: దేశ హోం మంత్రి అమిత్ షాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హోం మంత్రి శ్రీ.అమిత్ షా జీ తన పుట్టినరోజున. ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేంకటేశ్వరుడు ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాల నేతృత్వంలో భారతదేశం ఇప్పుడు చాలా సురక్షితంగా ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.