గ్రామీణ మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటి?
23 Mar, 2022 14:51 IST
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాల కల్పనపై కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంబంధిత కేంద్రమంత్రిని ప్రశ్నించారు. గడచిన రెండేళ్లలో కోవిడ్ కారణంగా కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా తగ్గిపోయిన విషయం వాస్తవమేనా? అలాగే సుశిక్షితులైన కార్మిక విభాగంలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య తగ్గుతున్న విషయం వాస్తవమేనా? ముఖ్యంగా గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు.