ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అక్ర‌మం

19 Jul, 2025 21:30 IST

విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్‌ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరు పరచనున్నారు. 
ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. #WeStandWithMidhunReddy అంటూ ఎక్స్ వేదిక‌గా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.  ఎంపీ మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి ఒక చీకటి దినం!. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది!. మిధున్ రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా నిల‌బ‌డుతుంది. 


మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ట్వీట్‌

రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ  మిధున్‌రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. చంద్ర‌బాబు గారూ అధికారం శాశ్వతం కాదన్నది గుర్తు పెట్టుకోండి.


కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ట్వీట్‌

  • రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి.
  • లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి.. మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
  • మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.

మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ట్వీట్‌

లిక్క‌ర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా క‌క్ష పూరితంగా ఎంపీ మిధున్‌రెడ్డి గారిని అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం మీకే చెల్లింది చంద్ర‌బాబు. మీ క‌క్ష‌లు తారాస్థాయికి చేరాయ‌న‌డానికి ప్ర‌స్తుత ప‌రిణామాలే సాక్ష్యం.