అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
తాడేపల్లి: వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పథకం ప్రారంభించినా... ఆ పథకానికి అర్హతలు ఉండి పొరపాటున మిగిలిపోయిన వారికి నెల రోజుల గడువు ఇస్తారు.. సీఎం వైయస్ జగన్. ఈ నేపథ్యంలోనే జూన్ నెలలో ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో పొరపాటున మిగిలిపోయిన అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. కాగా, గత నెలలో వాహన మిత్ర, జగనన్న చేదోడు, వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాలను ప్రారంభించి అర్హులందరికీ ఆర్థికసాయం అందించారు. ఈ పథకాల్లో మిగిలిపోయిన అర్హులందరికీ లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని పథకాలు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. గతేడాది డిసెంబర్ తర్వాత మగ్గం పెట్టుకున్న వారికి కూడా నేతన్న నేస్తం ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.