వాలంటీర్లకు నియామకపత్రాల అందజేత
8 Aug, 2019 13:47 IST
విశాఖ: గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎన్నికై సభ్యులకు మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. గురువారం జీవీఎంసీ కళ్యాణమండపంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 2వ వార్డు, గీత భవన్, దుర్గమ్మ గుడి, తదితర ప్రాంతాలకు చెందిన వార్డు వాలంటీర్లకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీ చైర్మన్ ద్రోణం శ్రీనివాస్ రాజు, విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త అక్కరమని విజయనిర్మల, జీవీఎంసీ అధికారులు నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.