టీడీపీ అంటే 'తెలుగు డ్రగ్స్ పార్టీ'
విశాఖపట్నం: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటనపై విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కే.కే. రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎం అప్పారావుతో కలిసి ఆయన మాట్లాడుతూ, కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ 'డ్రగ్ కేపిటల్'గా తయారైందని విమర్శించారు. అసలు టీడీపీ అంటే 'తెలుగు డ్రగ్స్ పార్టీ' గా మారిందని.. మండిపడ్డారు.
- టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ...
అధికార తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ ఈగిల్ టీంకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటనతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ గా మారింది. కూటిమి పాలనలో రాష్ట్రంలో గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంటే.. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రక్తపరీక్షల్లో సైతం ఎంపీ మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినా కూడా అధికార టీడీపీ నోరు మెదపడం లేదు. టీడీపీ సోషల్ మీడియాలో అసలేం జరగనట్టు... అబద్దాలను ప్రచారం చేయడం దుర్మార్గం. పుట్టా మహేష్ తో పాటు డ్రగ్స్ సేవిస్తున్న వారిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై సైతం కాల్పులు జరపడం చూస్తుంటే... తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. ఇది చాలా తీవ్రపరిణామం. ఏపీ టీడీపీ నేతలు డ్రగ్ మాఫియాగా ఏర్పడి మెక్సికో, బ్రెజిల్ డ్రగ్ డీలర్ ఎస్కోబార్ తరహాలో పోలీసులపైనే కాల్పులు జరిగే సంస్కృతిని తీసుకురావడం చాలా ఆందోళనకరం. టీడీపీ అంతే ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు డర్టీ పార్డీ, తెలుగు దొంగలు పార్టీలా మారిపోయింది.
- గతంలో వైయస్ఆర్‌సీపీపై భారీ దుష్ప్రచారం...
2024 మార్చి 19, 20 వ తేదీల్లో దేశవ్యాప్తంగా మీడియాలో కుట్రపూరితంగా, రాజకీయ లబ్ది కోసం కూటమి నేతలు కలకలం సృష్టించారు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన డ్రై ఈస్టుపై నానా యాగీ చేశారు. 25వేల కేజీల మత్తు పదార్ధాలు లభించాయని... దీనికి అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైయస్ఆర్‌సీపీకి సంబంధం ఉందంటూ... భారీ స్ధాయిలో దుష్ప్రచారానికి తెరలేపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లి తద్వారా లబ్ది పొందడానికి ఎల్లో మీడియా అత్యంత దారుణంగా ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షిప్ లో ఉన్నది డ్రగ్స్ కాదు డై ఈస్ట్ అని నివేదిక ఇచ్చి నిర్ధారించారు.
- ఏపీని డ్రగ్ కేపిటల్ చేసిన కూటమి ప్రభుత్వం...
డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ను స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కోడిని కోసిన వాడికి జైలు, డ్రగ్స్ వాడిన వాటికి స్టేషన్ బెయిల్ తరహాలో విచిత్రమైన పాలన సాగుతోంది. పుట్టిన రోజు నాడు కేక్ కట్ చేస్తే... వాళ్లని తీవ్రవాదుల్లా మొహాలపై ముసుగేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. కానీ ఇవాల డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డి అధికార పార్టీ నేతలును, గంజాయి, కొకైన్ మాఫియాలో పట్టుబడ్డ మీ పార్తీ నేతలను ముసుగేసి నడిపించే ధైర్యం మీకుందా? చంద్రబాబూ?. విశాఖలో సైతం వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్ నేతను ఈగల్ టీమే పేరుతో ఊరంతా తిప్పి...ఎక్కడ నుంచో ఎల్ సీ డీ తీసుకొచ్చి వారి జేబులో పెట్టి తప్పుడు కేసు నమోదు చేశారు. 120 రోజులైనా ఇంతవరకు బెయిల్ మంజూరు చేయలేదు. పోలీసుల అక్రమ చర్యలపై ఆధారాలిచ్చినా స్పందన లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీలపై ఈ స్ధాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతూ... అధికార పార్టీ నేతలు లిక్కర్, గంజాయి, మిల్క్, మట్టి, ఇసుక మాఫియాలు హబ్ గా ఏర్పడి దోచుకుంటున్నారు. ఏపీని డ్రగ్ కేపిటల్ గా మార్చేశారు.
- పుట్టా మహేష్ రాజీనామా చేయాలి..
చంద్రబాబు నాయుడుకి రాజ్యాంగం మీద గౌరవం, చిత్తశుద్ధి ఉంటే... డ్రగ్స్ సేవించి పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ని ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. అయన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలి. గతంలో టీటీడీ పాలకమండలి గా చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడే పుట్టా మహేష్.. అంటే ఎలాంటి చరిత్ర ఉన్న వ్యక్తులకు చంద్రబాబు పాలకమండలి అధ్యక్షుడు పదవి ఇచ్చారో స్పష్టమవుతోంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ కూడా ఆయన చేసిన అనైతిక కార్యకలాపాల గురించి ప్రశ్నిస్తే.... బీ ఆర్ నాయుడు నా ఇష్టం అని మాట్లాడ్డం దుర్మార్గం. మరోవైపు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లోనూ, కేంద్రంలోనూ తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని డ్రగ్స్ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంత బహిరంగంగా ఎంపీ డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయినా ఎల్లో మీడియాలో సమర్థించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో కాలేజీలు, హాస్టళ్లు, హోటల్స్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ స్వైరవిహారం చేస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ... మంత్రి లోకేష్ నియోజకవర్గంలో ఏకంగా కత్తులు, కర్రలతో గ్యాంగ్ వార్ కి దిగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. సంపద సృష్టి అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, హెరాయిన్, కొకైన్ అమ్మకాలను ఆదాయవనరులుగా మలుచుకోవడమా చంద్రబాబు గారూ? ఇదేనా మీ పరిపాలన?.
ఈ డ్రగ్స్ దందాలో ఉన్న టీడీపీ, కూటమి నేతలు పై పూర్ధిస్తాయి విచారణ జరిపించి, ఇందులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని కే కే రాజు డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ డ్రగ్ మాఫియాను రాష్ట్రం నుంచి పారద్రోలేవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం తధ్యమని స్పష్టం చేశారు.
● మొల్లి అప్పారావు, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త.
కూటమి పాలనలో డ్రగ్స్, గంజాయి దందాలతో పాటు మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబట్టం సిగ్గు చేటు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డం.. కూటమి నేతల అసలు రంగు బయటపెట్టింది. విశాఖలో ప్రఖ్యాత కరకచెట్టు పోలమాంబ దేవస్థానం చైర్మన్ విహాహేతర సంబంధం నెరుపుతూ... ఏకంగా భార్యకే రెడ్ హాండెడ్ గా దొరికినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఒకవైపు పుట్టా మహేష్ లాంటి కూటమి నేతలు టీవీల్లో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేసి.. బాధ్యతాయుతమైన ఎంపీ స్ధానంలో ఉండి కూడా డ్రగ్స్ సేవించడం దారుణం. వీళ్లు యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే సహా వరుసగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ ఘటనలు బయటపడుతున్నా కూటమి ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. నిస్సిగ్గుగా తమ నేతల చర్యలను సమర్ధించుకొంటున్నాడని మెల్లి అప్పారావు మండిపడ్డారు. ప్రజలందరూ కూటమి దుర్మార్గ పాలనను గమనిస్తున్నారని... తగిన టైంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. వైయస్.జగన్ పాలనలో ఈ తరహా సంఘటనలు ఒక్కసారి కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.