సీఎంని కలిసిన విశాఖపట్నం పోర్టు అథారిటీ నూతన చైర్మన్
5 Jun, 2023 19:39 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నం పోర్టు అథారిటీ నూతన చైర్మన్ ఎం.అంగముత్తు (ఐఏఎస్) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అంగముత్తును సీఎం వైయస్ జగన్ అభినందించారు.