జుత్తాడ బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండ
30 Apr, 2021 11:39 IST
విశాఖ: వి.జుత్తాడలో హత్యకు గురైన బాధిత కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అందజేశారు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి కలిసి ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వి.జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు బత్తిన అప్పలరాజును రిమాండ్‌కు తరలించారని తెలిపారు. ఏ-2 శ్రీనివాస్‌ను హోం గార్డు ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. బాధిత కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.