విశాఖలో వైయస్ఆర్‌సీపీ నిరసన
విశాఖ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త , నెడ్క్యాప్ చైర్మన్ కె కె రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో కలసి తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి నోటికి వచ్చేటట్టు ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు దోచుకున్న సొమ్ము ను హైదరాబాదులో పెట్టి అక్కడ ఆస్తులు విలువ పెంచుకునేందుకు మన రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ఇలా శాంతిభద్రతలకు విగుతం కలిగించే విధంగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పై టిడిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామని, వారు బేషరతుగా గా వచ్చి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, శశికళ, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు,కంటిపాము కామేశ్వరి, పద్మారెడ్డి, సారిపిల్లి గోవింద్,ఆళ్ళ లీలావతి, కంపా హనొక్,ఉషశ్రీ, కో ఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు, వార్డు ఇన్చార్జులు, మరియు ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ పార్టీ పని అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కొంగ జపాలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో ఎన్ని కుట్రలు, హత్యలు చేయించారో ప్రజలకు తెలుసన్నారు. పట్టాభి మాట్లాడింది తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.