వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి
5 Jun, 2019 10:34 IST
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌రామ్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీయ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.