డీఎస్పీ పోస్టింగ్‌లపై విచారణకు ఆదేశించాలి
6 May, 2019 16:59 IST
డీఎస్పీ పోస్టింగ్‌లపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా చంద్రబాబు పోస్టింగ్‌లు ఇచ్చారని తెలిపారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. పదోన్నతుల్లో పాటించాల్సిన రోటేషన్ రూల్స్‌ను ఉల్లంఘించారన్నారు. విచారణలో ఆరోపణలు రుజువు అయితే ప్రమోషన్లు రద్దు చేయాలన్నారు. పోలీసుశాఖలో పోస్టింగ్‌లపై విచారణ జరపాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.