వైయ‌స్ జగన్‌ది మోడల్ కేబినెట్ 

8 Jun, 2019 11:02 IST

అమ‌రావ‌తి: మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ సీఎం జగన్‌ గారు దేశంలోనే ఒక మోడల్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒక వినూత్న ప్రయోగమనే చెప్పాలి. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించాల‌ని తెలిపారు. జగన్‌ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే దిక్సూచిగా మారుతుంద‌ని మ‌రో ట్విట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి వైపు అడుగులు మొదలయ్యాయి. గడచిన ఐదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా చేస్తారాయన. ఎక్కడా దాపరికం లేని పారదర్శకత కనిపిస్తుంది. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశార‌ని తెలిపారు.