పిట్టల దొరను మించిన చంద్రబాబు
13 May, 2019 12:14 IST

అమరావతి : ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను చంద్రబాబునాయుడు మించి పోయాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేకపోయినా, అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నానని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడని ట్విటర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని పదవేమో కానీ, జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.